వైద్యులున్నా సేవలు నిమిత్తమాత్రమే
NZB: కరోనా తర్వాత ఆయుర్వేదం, హోమియో, యునాని వైద్యానికి ఆదరణ పెరుగుతోంది. ‘ఆయుష్’ ఆసుపత్రులు జిల్లాలో 42 చోట్ల కొనసాగుతున్నాయి. వైద్యులొచ్చాక ఆయుష్ ఆసుపత్రుల్లో ఓపీ పెరిగింది. కానీ, 6 నెలలుగా రోగుల సంఖ్యకు తగ్గట్లు ఔషధాల సరఫరా జరగడం లేదు. ఔషధాలకు శాఖ బడ్జెట్ పెంచకపోవడంతో నిధుల్లేక రోగులకు సరిపడా మందులు ఇవ్వలేకపోతున్నామని జిల్లా అధికారులు తెలిపారు.