నూతన తహసీల్దార్‌గా లక్ష్మి బాధ్యతలు

KDP: వేముల మండలంలో నూతన తహసీల్దార్‌గా టి.రెడ్డి లక్ష్మి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారుగా విధులు నిర్వహిస్తూ.. పదోన్నతి పొంది వేముల మండలంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న తహసీల్దార్ ఇందిరా రాణి పదవి విరమణ పొందారు. అనంతరం అధికారుల ఆదేశాల మేరకు పులివెందుల మండలం నుంచి వేములకు వచ్చారు.