రైతుల సంక్షేమమే మా లక్ష్యం: పార్థసారథి

రైతుల సంక్షేమమే మా లక్ష్యం: పార్థసారథి

AP: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. సాగు చేసే ప్రతి రైతుకు రాయితీపై విత్తనాలు అందిస్తామని చెప్పారు. బిందు సేద్యం పరికరాలను 90 శాతం రాయితీతో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.