VIDEO: పవిత్ర హత్య కేసులో నిందితుడు అరెస్ట్
HYD: వారాసిగూడలో పెళ్లికి ఒప్పుకోలేదని ఉమాశంకర్ అనే వ్యక్తి పవిత్రను కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు DCP బాలస్వామి తెలిపారు. 6 నెలల క్రితం నిందితుడితో యువతికి పెళ్లి నిశ్చయించారు. అతని ప్రవర్తన నచ్చక ఆమె దూరం పెట్టగా, కక్ష పెంచుకుని చంపేశాడు. అనంతరం పద్మారావు నగర్‌లోని సోదరుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.