VIDEO: విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సీఎం

HYD: నగరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నేడు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అమరవీరుల స్తూపం పక్కన పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.