VIDEO: సీఎం బహిరంగ సభ.. అధికారులు అప్రమత్తం
ADB: బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో 6వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గురువారం డాగ్ స్క్వాడ్ బృందాలు సభా ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.