VIDEO: 'దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు'

KRNL: గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని వైసీపీ నాయకులు భీమ్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి ఆరోపించారు. శనివారం మంత్రాలయం మండలం తాండా, సింగరాయనహళ్లి, ఓంనగర్‌లలో 'బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ' కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టారు.