లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ

KKD: కూటమి ప్రభుత్వం పది నెలల కాలంలోనే నియోజకవర్గంలో అనేక మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు మంజూరు అయ్యాయని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. శుక్రవారం జగ్గంపేటలో జ్యోతుల నవీన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు అయిన 17 మందికి రూ. 19,53,646 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.