వైభవంగా సాగిన అగస్తీశ్వర స్వామివారి ప్రాకారోత్సవం

CTR: పుంగనూరు రూరల్ నెక్కొంది సమీపంలోని కొండపై ఉన్న శ్రీ ఆగస్తీశ్వర స్వామి వారి ప్రాకారోత్సవం వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పండితులు మంగళవారం దేవి హోమం, కళా హోమం చేపట్టారు. అనంతరం పార్వతి పరమేశ్వరుల ఉత్సవమూర్తులను అలంకరించి, వాహనంపై కొలుదీర్చారు.