కొత్తవలసలో మృతదేహం కలకలం
VZM: కొత్తవలస మండలలో గురువారం ఓ గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించింది. పాత కొత్తవలస సమీపంలో స్మశాన వాటికకు వెళ్లే రహదారి బంధలో మృతదేహం బయటపడింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి భయాందోళన చెందారు. వెంటనే VRO రాధాకృష్ణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని ముఖం గుర్తుపట్టలేనంతగా ఉండడంతో అతని వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.