పోతురాజు గుట్టలో పోలీసుల కార్డాన్ సెర్చ్
పల్నాడు: కారంపూడి మండలం పేట సన్నేగండ్లలోని పోతురాజు గుట్ట కాలనీలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహేశ్వరరావు ఆధ్వర్యంలో గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టగా, పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.