విమానం నడిపిన కివీస్ ప్లేయర్

విమానం నడిపిన కివీస్ ప్లేయర్

ఎప్పుడూ మైదానంలో పక్షిలా ఎగిరి కళ్లు చెదిరే క్యాచులు అందుకునే గ్లెన్ ఫిలిప్స్.. ఈసారి నిజంగానే గాల్లోకి ఎగిరాడు. పైలట్ శిక్షణ తీసుకుంటున్న అతను.. ఓ బుల్లి విమానాన్ని స్వయంగా నడపడంతో పాటు సురక్షితంగా ల్యాండ్ చేశాడు. తనకు చిన్నప్పటి నుంచి విమానాలంటే ఇష్టమని, డబ్బు ఉండి ఉంటే క్రికెట్ బదులు విమానయానాన్నే కెరీర్‌గా ఎంచుకునేవాడినని ఫిలిప్స్ తెలిపాడు.