తెనాలి రైల్వే స్టేషన్ ఎదుట మృతదేహం లభ్యం
GNTR: తెనాలి రైల్వే స్టేషన్ వద్ద బుధవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డు పక్కన పడి ఉంది. మృతుడికి సుమారు 70 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.