స్ట్రాంగ్ రూంల భద్రతను పరిశీలించిన అధికారులు

కాకినాడ: జేఎన్టీయూ డా. బీఆర్. అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలోని ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూంను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్, జిల్లా ఎస్పీ ఎస్. సతీశ్ కుమార్ రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సురక్షితంగా భద్రపరచడం జరిగిందని ఎన్నికల అధికారి జె. నివాస్ తెలిపారు.