VIDEO: వర్షానికి జలమయమైన రోడ్డు

GDWL: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గద్వాలలోని రాఘవేంద్ర కాలనీ రోడ్డు పూర్తిగా జలమయమైంది. సరిగా లేని డ్రైనేజీ వ్యవస్థ కారణంగా వర్షపు నీరు వీధుల్లో నిలిచిపోతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి వల్ల ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోయారు.