పారిశుధ్య కార్మికులకు కమీషనర్ ఆదేశాలు
VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఇవాళ స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఆకస్మికంగా పర్యటించి, పారిశుధ్య అధికారులతో కలిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ-ఆటోలు, అదనపు సిబ్బందితో చెత్తను పూర్తిగా తొలగించాలని, శివారు ప్రాంతాల్లోనూ పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.