ఘనంగా మాజీ CM కేసీఆర్ వేడుకలు

ఘనంగా మాజీ CM కేసీఆర్ వేడుకలు

MLG: కన్నాయిగూడెం మండలంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలను BRS ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, సాగునీటి పథకాలు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి కుర్సం రమాదేవిని సన్మానించారు.