కాల్వ పనులను పూర్తి చేయాలి: సీపీఎం నాయకులు

కాల్వ పనులను పూర్తి చేయాలి: సీపీఎం నాయకులు

JN: చిల్పూరు మండలం కృష్ణాజిగూడెంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కాలువను సీపీఎం నాయకులు మంగళవారం సందర్శించారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన కాల్వ నేటికి నిరుపయోగంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా కాల్వ పనులను పూర్తి చేయాలని కోరారు. మండల కార్యదర్శి రమేష్ తదితరులున్నారు.