VIDEO: ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

KNR: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డు చౌరస్తాలో జ్యోతిరావు పూలే కమిటీ అధ్యక్షులు రఘు ఆధ్వర్యంలో 200వ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. పూలే దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.