మార్కాపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే
ప్రకాశం: మార్కాపురం మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో గురువారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. మండలంలోని రాయవరం గ్రామంలో మార్కాపురం డివిజన్ డెవలప్‌మెంట్ అధికారి నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గోగులదిన్నె గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.