కరెంటు షాక్‌కు గురై పెయింటర్ మృతి

కరెంటు షాక్‌కు గురై పెయింటర్ మృతి

కోనసీమ: పి.గన్నవరం మండలం ముంగండ గ్రామంలో కరెంట్ షాక్‌కు గురై అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన నేదునూరు రామకృష్ణ (28) శుక్రవారం మృతి చెందారు. పెయింటింగ్ పని చేస్తుండగా రామకృష్ణకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతడిని సమీపంలోని పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. రామకృష్ణకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.