ఆకట్టుకుంటున్న 'ద్రౌపది 2' హీరోయిన్ ఫస్ట్ లుక్
నటుడు రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ద్రౌపది 2'. ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె ద్రౌపది పాత్ర పోషిస్తోంది. పోస్టర్‌లో రక్షణ హుందాగా, గాంభీర్యంగా కనిపిస్తోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించనుంది.