మహబూబాబాద్ నుంచి శ్రీశైలంకు బస్సు
MHBD: ఆర్టీసీ ఆధ్వర్యంలో యాత్ర టూర్ ప్యాకేజీలో భాగంగా MHBD నుంచి శ్రీశైలానికి ప్రత్యేక డీలక్స్ బస్సు వెళ్తున్నట్లు DM కళ్యాణి తెలిపారు. ఈ నెల 19న రాత్రి 10 గంటలకు డిపో నుంచి బయలుదేరి శ్రీశైలం చేరుకొని, నాగార్జునసాగర్ చిన్న కేశవస్వామి ఆలయాన్ని దర్శించుకొని ఈ నెల 21న MHBD చేరుకుంటుందన్నారు. పెద్దలకు ₹ 1,700, పిల్లలకు ₹900 నిర్ణయించామని తెలిపారు.