సిబ్బంది నిర్లక్ష్యం.. సస్పెండ్ చేసిన కమిషనర్
VSP: ఎండాడలో జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ బుధవారం పర్యటించారు. ఈ మేరకు రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తున్న దుకాణాన్ని స్వయంగా తొలగించారు. పలువురు నివాసితులు తాగునీరు రోజు సరఫరా జరగడం లేదని చెప్పగా లైన్ మెన్ నిర్లక్ష్యాన్ని గమనించి అతనిని సస్పెండ్ చేశారు. సహాయక ఇంజినీర్ సతీష్‌కి షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు.