నేడు నీటి సరఫరాకు అంతరాయం

నేడు నీటి సరఫరాకు అంతరాయం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి నీటి సరఫరా చేసే ప్రధాన పైప్లాన్ ఎయిర్ వాల్వ్ మరమ్మతులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ రామలింగం తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని కోరారు.