సిద్దవటంలోని మాధవరం-1లో నాకాబందీ

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1లో నాకాబంది నిర్వహించారు. కడప జిల్లా ఎస్పీ ఈజీ. అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సీఐ బాబు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నాకాబంది నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ప్రజలు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ప్రశాంత జీవనం గడపాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సీఐ కోరారు.