హక్కుల కోసం కొమురం భీమ్ స్ఫూర్తితో పోరాటం

హక్కుల కోసం కొమురం భీమ్ స్ఫూర్తితో పోరాటం

KMM: ఆదివాసీలపై నిర్భంధాలు, వివక్షతపై మరో పోరాటానికి సమాయత్తం కావాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు బచ్చల వెంకటేశ్వర్లు అన్నారు. కొమురం భీమ్‌ 85వ వర్ధంతి సందర్భంగా మంగళవారం కారేపల్లిలో భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు. అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీలపై నిర్భంధాలు విధిస్తుండడంతో వారి అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందన్నారు.