లారీని ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం
కృష్ణా: గన్నవరం వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రయాణికుల బస్సు, అతివేగంతో వస్తూ యూ-టర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే అట్కూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.