నిత్యవసర ధరలను తగ్గించాలని ఆందోళన

ఆదిలాబాద్: పెంచిన నిత్యవసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. నిత్యవసర ధరలను తగ్గించాలంటే సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు.