స్థల వివాదం రాత్రంతా శవంతో జాగారం

స్థల వివాదం రాత్రంతా శవంతో జాగారం

ప్రకాశం: స్మశాన స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో రాత్రంతా శవంతో జాగారం చేసిన అమానుష ఘటన కనిగిరిలో చోటుచేసుకుంది. పట్టణంలోని బోయపాలెం సమీపంలో 2 ఎకరాల స్థలాన్ని స్థానికులు స్మశానంగా వినియోగిస్తున్నారు. కొందరు ఇటీవల ఆ స్థలం తమదని అక్కడున్న సమాధులు తొలగించారు. నిన్న వృద్ధురాలు మృతిచెందగా అదే స్థలంలో ఖననం చేసేందుకు ప్రయత్నించగా స్థల యజమానులు అడ్డుకున్నారు.