పేకాట స్థావరంపై పోలీసులు దాడి

పేకాట స్థావరంపై పోలీసులు దాడి

NDL: కొలిమిగుండ్ల మండలంలోని కలవటాల గ్రామ సమీపంలో ఇవాళ పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సీఐ రమేష్ బాబు పోలీసులతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20,620 నగదును స్వాధీనం చేసుకుని ఏడుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు పేర్కొన్నారు.