VIDEO: కుప్పకూలిన భారీ వృక్షాలు

ELR: లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం-రామచంద్రపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో శనివారం 8 భారీ వృక్షాలు నేలకొరిగాయి. అనుకోని రీతిగా ఉరుములు మెరుపులతో వచ్చిన వర్షానికి భారీ వృక్షాలు కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు. చెట్లు పడిపోవడంతో ప్రధాన రహదారి వెంట వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు ట్రాక్టర్లతో పడిపోయిన చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు.