పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా వచ్చి సరదాగా గడిపారు. సముద్ర స్నానాలు చేసి, ఇసుకదిన్నెలపై ఆటలాడుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, మబ్బుల వాన జల్లులతో పర్యాటకులు ఆనందించారు. తీరంలోని ఆలయాలను కూడా సందర్శించారు.