ఆర్థిక మంత్రితో PSBల సమావేశం
2025-26 రెండో త్రైమాసికం ఫలితాల పనితీరుపై సమీక్ష చేయడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షత వహించనున్నారు. దేశానికి పెద్ద, ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని, ఈ దిశగా RBI, బ్యాంకులు అడుగులు వేయాలని ఆర్థిక మంత్రి గతవారం సూచించిన విషయం తెలిసిందే.