ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

VZM: గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సహకారంతో జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ జాక్సన్ 58 మంది రోగులను పరీక్షించగా 22 మందిని క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు.