ఆసిఫాబాద్ విద్యుత్ SEగా ఉత్తమ్ జాడె నియామకం

ఆసిఫాబాద్  విద్యుత్ SEగా ఉత్తమ్ జాడె నియామకం

ఆసిఫాబాద్ జిల్లా విద్యుత్ SEగా ఉత్తమ్ జాడె నియమితులయ్యారు. మంచిర్యాల జిల్లా NPDCL ఎస్ఈ ఆపరేషన్‌గా పని చేస్తున్న ఆయనను జిల్లాకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేసిన శేషారావు ఆదిలాబాద్ కు బదిలీ అయ్యారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ జాడేకు కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.