80శాతం పెన్షన్ పంపిణి పూర్తి : ఎంపీడీవో

విజయనగరం: పాచిపెంట మండలంలో రెండో రోజు సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణి చేస్తున్నారు. గురువారం ఉదయం 6 గంటల నుండే సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ ఇస్తున్నారు. మండలంలో గురువారం మధ్యాహ్నంకు 80 శాతం పెన్షన్ పంపిణి పూర్తి చేసినట్లు పాచిపెంట ఎంపీడీ పున్నప లక్ష్మికాంత్ తెలిపారు. మిగిలిన పెన్షన్ పంపిణీ వేగంగా జరుగుతుందన్నారు.