వెంకటేశ్వర నగర్ కాలనీల నూతన కమిటీ
MDCL: అల్వాల్ సర్కిల్, వెంకట సాయి నగర్ మరియు వెంకటేశ్వర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షుడిగా మేడ వెంకట సురేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్‌గా కే శివయ్య, జనరల్ సెక్రటరీగా నాగేశ్వరరావు, కోశాధికారిగా జ్ఞానేశ్వర్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా బోస్, శివశంకర్, అప్పారావు, వెంకటగిరి తదితరులు ఉన్నారు.