NDA విజయం.. సీఎం కీలక వ్యాఖ్యలు

NDA విజయం.. సీఎం కీలక వ్యాఖ్యలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ ఫలితంతో ఇండియా కూటమి ఎంతో నేర్చుకోవాలని తెలిపారు. బీహార్ ఫలితాలు అందరికీ పాఠమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎన్నికల్లో విజయం సాధించిన నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఈ ఫలితంతో ఈసీపై వచ్చిన ఆరోపణలు కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని వెల్లడించారు.