శ్రీపురం జాతీయ రహదారిపై యాక్సిడెంట్

శ్రీపురం జాతీయ రహదారిపై యాక్సిడెంట్

SKLM: శ్రీపురం జాతీయ రహదారిపై యాక్సిడెంట్ కోటబొమ్మాలి మండలం శ్రీపురం జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున బొలెరో, లారీ ఢీ కొన్నాయి. శ్రీపురం సంతకి కూరగాయల లోడ్‌తో వస్తున్న బొలెరో రాంగ్ రూట్‌లో రావడం వలన ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.