VIDEO: గుంతలమయంగా తలమడుగు-రూయ్యడి రోడ్డు.!
ADB: రూయ్యడి గ్రామం నుంచి తలమడుగు మండల కేంద్రానికి వెళ్లే రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రూయ్యడి, సకినాపూర్, అర్లి (కే), బరంపూర్ గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటారు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.