మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్న రైతు

మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్న రైతు

KMM: సింగరేణి మండలంలోని బల్లూనగర్ తండాలో గుగులోత్ నంద్యా (54) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది మిర్చి పంటలో నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుతాయని భావించినప్పటికీ, అకాల వర్షాల వల్ల పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పులు మరింత పెరిగిపోవడంతో మనస్థాపానికి గురైన నంద్యా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.