'డీలర్లు బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదు'

'డీలర్లు బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదు'

KDP: పులివెందులలో రేషన్ షాప్ డీలర్లు బియ్యం ఇవ్వకుండా కులం పేరుతో దూషిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో వారు మాట్లాడారు. ప్రతిసారి బియ్యం కోసం వెళ్ళినప్పుడు గొడవ పడుతున్నారని, గోధుమలు, జొన్నలు రెండు రోజుల్లోనే అయిపోతున్నాయని డీలర్లు చెబుతున్నారని తెలిపారు. రాజకీయాలు తమకు తెలియదని, కచ్చితంగా బియ్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.