ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

NRML: నర్సాపూర్ (జి) మండలం నసీరాబాద్ గ్రామ ఫారెస్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందని, అతడు తెలుపు రంగు షర్టు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకి తెలిసినవారు నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ నంబర్ 8712659517కు సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు.