లోతట్టు ప్రాంతాలు జలమయం.. అధికారుల చర్యలు

సత్యసాయి: ధర్మవరంలో భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు నీరు రోడ్లపైకి వచ్చింది. విషయం తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు.. జేసీబీల సాయంతో పూడికతీత పనులను చేపట్టారు.