'రహదారి భద్రతను కాపాడటం అందరి బాధ్యత'
ప్రకాశం: రహదారి భద్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరి హైవే రోడ్డుపై ఇళ్ల నిర్మాణాల నుంచి వచ్చిన శిథిలాలు, మట్టి, వ్యర్థాలను రహదారి పక్కన వేస్తున్న వారి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. జాతీయ రహదారి పక్కన శిధిలాలు వేసిన వారి వివరాలు తెలిపితే రూ.10 వేలు బహుమతి ఇస్తామన్నారు.