పెన్షన్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

ATP: గుంతకల్లు పట్టణం 10వ వార్డులో మున్సిపల్ కమిషనర్ నయూం అహ్మద్ పింఛన్లను పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులతో కలిసి రాయల్ సర్కిల్, కథలగేరి తదితర ప్రాంతాలలో పర్యటించారు. అర్హులకు పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ఇవాళే పింఛన్ పంపిణీ పూర్తి కావాలని సిబ్బందికి సూచించారు.