VIDEO: శబరిమలను తలపిస్తున్న యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గిరిప్రదక్షిణకు అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో యాదాద్రి మరో శబరిమలగా తలపించింది. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నిర్వాహకుల కోరిక మేరకు సోమవారం ప్రత్యేక ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనం ప్రసాద వితరణ పలు సౌకర్యాలు కల్పించడంతో అయ్యప్ప స్వాములు సంతృప్తి వ్యక్తం చేశారు.