రోడ్లు, డ్రెయిన్లలో చెత్త వేస్తే జరిమానా: కమిషనర్

రోడ్లు, డ్రెయిన్లలో చెత్త వేస్తే జరిమానా: కమిషనర్

GNTR: గుంటూరు నగరంలోని రోడ్లు, డ్రెయిన్లలో చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ స్పష్టం చేశారు. బుధవారం పాతగుంటూరు తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతున్నా కొందరు నిర్లక్ష్యంగా రోడ్లపై వ్యర్థాలు వేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.