ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
నెల్లూరు మెడికల్ కళాశాలలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం, నాగ మహేశ్వర అనే MBBS మూడవ సంవత్సరం విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు, కళాశాల అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి, పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.